Chandra Babu : కమ్ బ్యాక్ మామూలుగా లేదుగా.. కేంద్రంలోనూ కీలకంగా మారిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కమ్ బ్యాక్ చాలా గట్టిగానే ఇచ్చారు. ఆంధ్రాలో చక్రం తిప్పడానికి రెడీ అవ్వడమే కాక కేంద్రంలోనూ కీలకంగా మారారు. కొత్త ఏర్పాటులో ఆయన ముఖ్య భూమిక పోషించబోతున్నారు.

Chandrababu: అవమానం నుంచి అద్భుత విజయం వరకూ.. చంద్రబాబు అలుపెరుగని పోరాటమిదే!
New Update

National Politics : కేంద్రం (Central) లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు. బీజేపీ (BJP) నే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది... మోదీ 8వ తేదీన ప్రధానిగా ప్రమాణం చేస్తారని ఆ పార్టీ చెప్పింది. కానీ అధికారికంగా మాత్రం ఇంకా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే నిన్న ఎన్డీయే (NDA) మిత్ర పక్షాలు అన్నీ కలిసి చాలాసేపు ఈ విషయం మీద చర్చ చేశాయి. ఇందులో టీడీపీ (TDP) అధినేత, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్య పాత్రను పోషించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో పెద్ద పార్టీగా టీడీపీ మారింది. దీంతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీడీపీ మద్దతు చాలా అవసరం. ఇది మొత్తం దేశం, మీడియా దృష్టి అంతా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వైపు మళ్ళింది. నిన్నంతా ఆయనే వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

ఎక్కువ లోక్‌సభ స్థానాలు సాధించి పార్టీగా బీజేపీ నిలిచినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 272కు ఇంకా 32 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో మిత్రపక్షాల మద్దతు మోదీకి అవసరం. దీంతో ఇప్పుడు చంద్రబాబు, నితీశ్ కుమార్ లాంటి వారి మద్దతు మోదీకి అనివార్యమైంది. మరోవైపు ఇండియా కూటమి (India Alliance) కూడా టీడీపీ, జేడీయూ అధినేతలను సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కూడా వాజ్‌పేయ్ సమయంలో ఉన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. రాష్ట్రపతిగా అబ్దుల్‌కలాంను ప్రతిపాదించడంలోనూ ముఖ్యభూమిక ఆయనదే. ప్రాంతీయపార్టీగా ఉన్నప్పటికీ 1984లో లోక్‌సభలో ప్రధానప్రతిపక్ష పాత్ర పోషించిన తెలుగుదేశం ఆ తర్వాత నుంచి అవసరం వచ్చిన ప్రతిసారీ ఏదో రూపంలో జాతీయపార్టీలతో సమానంగా ఢిల్లీలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చింది.

ఇప్పుడు టీడీపీ ఎటువైపు ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్‌గా మారింది. ఎన్డీయే కూటమితోనే కలిసి ఉంటుందా...ఇండియా కూటమి గురించి కూడా ఆలోచిస్తోందా అనేది తెలియాల్సి ఉంది. దీని మీద జాతీయ స్థాయిలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. నిన్న ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నాయుడిని మీడియా చాలాసార్లు దీని గురించి అడిగింది. అయితే ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన మాత్రం తాను ఎన్డీయేలోనే కొనసాగుతానని...దాని గురించి సందేహమే అక్కర్లేదని చెప్పారు. మరోవైపు నిన్న మోదీ ఇంట్లో జరిగిన మీటింగ్‌లో చంద్రబాబుకు పెద్ద పీట వేశారు. ప్రధానమంత్రికి ఒకవైపు బీజేపీ అగ్రనేతలు కూర్చుంటే, మరోవైపు చంద్రబాబు, నితీశ్‌కుమార్‌లు కూర్చున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు కూడా ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి రావడమే కాకుండా జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు.

Also Read : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

#national-politics #chandrababu #central #tdp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి