Chandrababu: 'కళ్లు తెరిపిద్దాం'.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ మరో నిరసన కార్యక్రమం..

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తెలుగుదేశం పార్టీ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 'జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుందాం.. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి, చంద్రబాబుకు సంఘీభావంగా "నిజం గెలవాలి" అని గట్టిగా నినదిద్దాం.' అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు నారా లోకేష్. టీడీపీ శ్రేణులు, ప్రజలు తాము చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను, చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు లోకేష్.

New Update
Chandrababu: 'కళ్లు తెరిపిద్దాం'.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ మరో నిరసన కార్యక్రమం..

Andhra Pradesh: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌ను నిరసిస్తూ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). రేపు రాత్రి అంటే అక్టోబర్ 29వ తేదీన రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు(5 నిమిషాలు) 'కళ్ళు తెరిపిద్దాం' నిరసన కార్యక్రమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారాయన. ఈ మేరకు పార్టీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. 'జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుందాం.. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి, చంద్రబాబుకు మద్దతుగా "నిజం గెలవాలి" అని గట్టిగా నినదిద్దాం.' అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు నారా లోకేష్. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు నారా లోకేష్. కాగా, టీడీపీ శ్రేణులు, ప్రజలు తాము చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను, చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు లోకేష్.

ఉదయం బాబుతో ములాఖత్.. సాయంత్రం హైదరాబాద్‌కు పయనం..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు నారా భువనేశ్వరి, లోకేష్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్. ఉదయం సమయంలో వీరంతా ములాఖత్ అయ్యారు. కాగా, సాయంత్రం నారా లోకేష్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. రాజమండ్రి క్యాంపు కార్యాలయంలోనే భువనేశ్వరి ఉన్నారు. ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'కళ్లు తెరిపిద్దాం' నిరసన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొంటారు.

కర్రలు పట్టుకుని రోడ్డు మీదకు వచ్చిన టీడీపీ శ్రేణులు..

విశాఖలో టీడీపీ శ్రేణులు అలజడి సృష్టించారు. కర్రలు పట్టుకుని రోడ్డు మీదకు వచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 50 రోజులు అయినా.. ప్రభుత్వం ఆయనకు బెయిల్ రానివ్వకుండా హింసిస్తోందని ఆరోపించారు టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో చంద్రబాబు నాయుడుకి ఏమైనా జరిగితే.. వైసీపీ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం జగన్‌ను హెచ్చరించాయి టీడీపీ శ్రేణులు.

Also Read:

కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు..

సీఎం జగన్‌ పథకాలపై జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం.. ఫుల్ ఖుషీలో వైసీపీ ఫ్యాన్స్‌..

Advertisment
Advertisment
తాజా కథనాలు