సిగిరెట్లు, గుట్కాలపై పన్నులు పెంచాలి.. కేంద్రానికి సూచనలు

2024-25 కేంద్ర బడ్జెట్‌ పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ పన్ను పెంచాలని వైద్యులు, ఆర్థిక వేత్తలు కేంద్రానికి సూచించారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ని తీసుకొచ్చిన ఆరేళ్లలో కూడా పొగాకు పన్ను పెంచలేదని.. దాన్ని పెంచాల్సిన సమయం వచ్చిందని సూచలన చేశారు.

సిగిరెట్లు, గుట్కాలపై పన్నులు పెంచాలి.. కేంద్రానికి సూచనలు
New Update

ప్రతిరోజూ సిగరెట్లు కాల్చేవాళ్లు, గుట్కా తీసుకునేవాళ్లు అనేకమంది ఉంటారు. అయితే ప్రజారోగ్య సంరక్షణ కోసం 2024-25 కేంద్ర బడ్జెట్‌లో పోగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ పన్ను పెంచాలని వైద్యులు, ఆర్థిక వేత్తలు, ప్రజారోగ్య ఉద్యమకారులు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. అయితే ప్రస్తుతం గుట్కాపై 63 శాతం, సిగరేట్లపై 49.3 శాతం, బీడీలపై 22 శాతం ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపై 75 శాతం పన్ను విధించాలని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. ఇండియాలో విధిస్తున్న పన్ను తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ని తీసుకొచ్చిన ఆరేళ్లలో కూడా పొగాకు పన్ను పెంచలేదని.. దాన్ని పెంచాల్సిన సమయం వచ్చిందని ఆరోగ్య ఆర్థికవేత్త డాక్టర్‌ రిజో జాన్ సూచలన చేశారు. ప్రభుత్వం వీటిపై పన్నులు పెంచకపోతే.. పొగాకును ఉత్పత్తి చేసే కంపెనీలు వాటికవే ధరలు పెంచుకొని అధనపు లాభాలు ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అదనపు ఆదాయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలని రిజో జాన్ కోరారు.

Also read: మరిన్ని చిక్కుల్లో మహువా.. రంగంలోకి దిగిన సీబీఐ..

అంతేకాదు పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచితే వాటి వాడకం తగ్గుతుందని.. తద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచ దేశాల్లోని పొగాకు ఉత్పత్తులపై చాల తక్కువగా పన్ను విధిస్తున్న దేశాల్లో ఇండియా ఒకటని పార్లమెంటరీ స్థాయి సంఘం ఇటీవలే తెలిపింది. అయితే ఈ పొగాకు వాడినవారిలో ఎక్కువగా నోటి క్యాన్సర్లు వస్తున్నాయని.. అలాగే ఉపిరితిత్తలు, అన్నవాహిక, ఉదర క్యాన్సర్లు కూడా వస్తున్నాయని.. పార్లమెంటరీ స్థాయీ సంఘం తెలిపింది.అయితే పొగాకు పన్ను పెంచగా వచ్చే అదనపు ఆదాయన్ని క్యాన్సర్ చికిత్స కోసం ఖర్చు పెట్టాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ప్రపంచంలో 26.8 కోట్ల మంది పొగాకుకు అలవాటు పడ్డారు. వీటి వల్ల వచ్చే వ్యాధులతో ప్రతి ఏడాది 13 లక్షల మంది చనిపోతున్నారు. వచ్చే క్యాన్సర్లలో 27 శాతం పొగాకు వాడటం వల్లే వస్తున్నాయని బయటపడింది.

#telugu-news #national-news #cigirette #gutka
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe