T Rajaiah: బీఆర్ఎస్‌లోకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య?

మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆయన ఇంటికెళ్లి ఆహ్వానించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.

Thatikonda Rajaiah: కడియం కులంపై విచారణ జరపాలి.. తాటికొండ రాజయ్య గరం
New Update

Thatikonda Rajaiah May Join BRS: మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయనను మరోసారి పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ నేతలు ఇంటికెళ్లి ఆహ్వానించినట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ సీటు కేటాయించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఆ 2 డిమాండ్లకు కాంగ్రెస్ ఓకే.. కడియం ఫుల్ హ్యాపీ!

ఎమ్మెల్యే సీటు నిరాకరణ..

ఈ క్రమంలోనే రాజయ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక రాజయ్య ఇటీవల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందిన ఆయన బీఆర్ఎస్ ను వీడారు. దీని తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. ఇదిలావుంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

#thatikonda-rajaiah #warangal #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe