Tata : 2500 మంది ఉద్యోగులకు ''టాటా''... బైబై!

యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ రెడీ అయ్యింది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది.

Tata : 2500 మంది ఉద్యోగులకు ''టాటా''... బైబై!
New Update

Tata Steel Lay Off : మన దేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూప్‌ (Tata Group) లోని టాటా స్టీల్‌ (Tata Steel) పలు దేశాల్లో తమ వ్యాపారాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థ తాజాగా షాకింగ్‌ నిర్ణయాన్ని తీసుకుంది. యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ రెడీ అయ్యింది. యూకే (UK) కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది.

స్టీల్ తయారీ విధానంలో పర్యావరణ హిత మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు తప్పదని సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు, కంపెనీ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతేడాది చివరి నాటికి యూకే ప్రభుత్వం తమ దేశంలో గ్రీనెర్ స్టీల్ ప్రోడక్షన్ కోసం సుమారు 500 మిలియన్ యూరోల నిధులు కేటాయించింది. బ్రిటన్ లో అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థగా టాటా స్టీల్‌ పేరు పొందింది. కంపెనీలో 8 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

అయినప్పటికీ సుమారు 3000 మంది ఉద్యోగాలు రిస్క్‌లోనే ఉన్నయాని గతంలో కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులు ఈ రంగంలోని 5000 మంది ఉద్యోగులకు భద్రత కల్పిస్తుందని, మిగిలిన 3 వేల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే సంస్థలో ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధి కోల్పోవడంతో పోర్ట్ టాల్బోట్, యూకే తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం కచ్చితంగా ఉంటుందని జీఎంబీ యూనియన్ సీనియర్ అదికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా…13 మంది మృతి!

#jobs #layoffs #tata-steel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe