Bigg Boss 7 Telugu: 15 సినిమాల్లో ఆఫర్.. బిగ్ బాస్ తర్వాత బంపర్ ఆఫర్ కొట్టేసిన టేస్టీ తేజ

బిగ్ బాస్ సీజన్ 7... మరి కొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. నాగార్జున ఎక్స్ హౌస్ మేట్స్ ను బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉందని అడగగా..15 సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

New Update
Bigg Boss 7 Telugu: 15 సినిమాల్లో ఆఫర్.. బిగ్ బాస్ తర్వాత బంపర్ ఆఫర్ కొట్టేసిన టేస్టీ తేజ

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షో తర్వాత సెలెబ్రెటీల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రియాలిటీ షో తర్వాత లైఫ్ సూపర్ గా ఉంటుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బిగ్ బాస్ షో ద్వారా పెద్దగా ఉపయోగమేమి లేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈ రోజు విడుదలైన ప్రోమోలో నాగార్జున ఎలిమినేట్ అయిన సీజన్ 7 ఎక్స్ హౌస్ మేట్స్ ను బిగ్ బాస్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉందని అడిగారు. కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ లైఫ్ లో బిగ్ బాస్ ఎలాంటి మార్పులు తెచ్చిందో తెలిపారు. ఈ సందర్భంగా టేస్టీ తేజ చెప్పిన విషయాలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇతరుల సంగతి ఏంటీ..? అనేది పక్కన పెడితే.. బిగ్ బాస్ షో తర్వాత తనకు చాలా మేలు జరిగిందని చెప్పారు టేస్టీ తేజ.

15 సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి

బిగ్ బాస్ షోకు ముందు టేస్టీ తేజ.. సెలెబ్రెటీ గెస్టులతో ఫుడ్ వీడియోస్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. జబర్దస్త్ లాంటి కామెడీ షోలో స్కిట్స్ ద్వారా అందరినీ నవ్వించారు. సెలెబ్రెటీ ఫుడ్ వీడియోస్ తో పాపులరైన తేజ బిగ్ బాస్ సీజన్ 7 లో ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ షోలో తన కామెడీతో అందరినీ ఎంటర్ టైన్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

publive-image

బిగ్ బాస్ తర్వాత తన లైఫ్ సూపర్ గా ఉందని.. 15 సినిమాల్లో అవకాశాలు వచ్చాయని గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో నాగార్జునతో తెలిపారు. బిగ్ బాస్ తర్వాత ప్రేక్షకులు తనను ఇంకా బాగా గుర్తించారని తేజ హ్యాపీగా ఫీల్ అయ్యారు. గత సీజన్స్ లోని బిగ్ బాస్ తర్వాత లైఫ్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న ఎక్స్ కంటెస్టెంట్స్ విషయానికొస్తే.. సోహెల్, సన్నీ, రాహుల్, శ్రీముఖి, దివి పెద్ద పెద్ద సినిమాలు, షోలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరి కొంత మంది టీవీ షోస్, సీరియల్స్ చేస్తూ కూడా చేస్తున్నారు.

Bigg Boss Grand Finale: రవితేజ కోసం ట్రోఫీ వదిలేస్తాను.. అమర్ చేసిన పనికి షాకైన మాస్ మహారాజ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు