Bigg Boss Grand Finale: రవితేజ కోసం ట్రోఫీ వదిలేస్తాను.. అమర్ చేసిన పనికి షాకైన మాస్ మహారాజ

తాజాగా గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ప్రోమో విడుదలైంది.సెలెబ్రెటీలు, స్టార్ హీరోస్ రాకతో గ్రాండ్ ఫినాలే స్టేజ్ సందడిగా మారింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో హోస్ట్ నాగార్జున తో పాటు ఇప్పటికే ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్.. టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు.

New Update
Bigg Boss Grand Finale: రవితేజ కోసం ట్రోఫీ వదిలేస్తాను.. అమర్ చేసిన పనికి షాకైన మాస్ మహారాజ

Bigg Boss Grand Finale: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగింది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో సూపర్ సక్సెస్ అయింది. 100 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ వచ్చేసింది. మరి కొన్ని గంటల్లో సీజన్ 7 విజేత ఎవరో తెలియనుంది. దాదాపు నాలుగు గంటల పాటు సాగే ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో ఊహించని ఉల్టా పుల్టా ట్విస్టులు ఎన్నో ఉండబోతున్నాయి.

publive-image

తాజాగా గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ప్రోమో విడుదలైంది.సెలెబ్రెటీలు, స్టార్ హీరోస్ రాకతో గ్రాండ్ ఫినాలే స్టేజ్ సందడిగా మారింది. రవితేజ, రోషన్ కనకాల, యాంకర్ సుమ, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ సందడి చేశారు. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో హోస్ట్ నాగార్జున తో పాటు ఇప్పటికే ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్.. టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు.

publive-image

గ్రాండ్ ఫినాలే ప్రోమోలో ఎక్స్ కంటెస్టెంట్ అశ్విని, శుభ శ్రీ, శోభ, గౌతమ్, తేజ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. సందీప్ మాస్టర్, నయని పావని నర్సపల్లె ఫోక్ సాంగ్ తో స్టేజ్ షేక్ చేశారు. ఆ తర్వాత సెలెబ్రెటీ పర్ఫామెన్స్ తో గ్రాండ్ ఫినాలే స్టేజ్ అదిరిపోయింది.

publive-image

ప్రోమో చివరిలో మాస్ మహారాజ రవితేజ స్టేజ్ పై సందడి చేశారు. 'ఈగల్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై పాల్గొన్నారు. అమర్ దీప్ రవితేజకు వీరాభిమాని అనే విషయం బిగ్ బాస్ ప్రేక్షకులకు తెలిసిందే. ఇక గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై నాగార్జున.. అమర్ కోసం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు.

"అమర్ నీకు ఫెంటాస్టిక్ ఆఫర్ ఇస్తున్నాను.. నీ కోసం గేట్స్ ఓపెన్ అవుతాయి.. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తే.. రవితేజ నెక్స్ట్ సినిమాలో రవితేజతో పాటు యాక్ట్ చేస్తావు" అని చెప్పారు. ఈ ఆఫర్ కావాలా.. వద్దా ఆలోచించుకో అని 7 సెకండ్స్ టైం ఇచ్చారు నాగార్జున.
అమర్ ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా పరుగెత్తుకుంటూ గెట్ దగ్గరకు వెళ్ళాడు. 100 రోజులు తాను కష్టపడి ఆడాడు.. కానీ ఆఖరి నిమిషంలో నీ కోసం కప్పును కూడా వదిలేసి వస్తున్నాడు అన్నట్లుగా నాగార్జున తెలిపారు. ఇది చూసి రవితేజ కూడా షాకయ్యారు. 'నాకు ఎం మాట్లాడాలో అర్థం కావట్లేదు అన్నారు'. అమర్ అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

publive-image

Bigg Boss: ఈసారి బిగ్‌బాస్ లో రచ్చ చేసిన జంట ఎవరంటే! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు