Target Pawan Kalyan: ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. నేరుగా చూస్తే రెండు పార్టీల మధ్య పోరులా అనిపిస్తుంది. కానీ, ఈ రెండు పార్టీలు ఎవరినో టార్గెట్ చేసుకున్నట్టుగా వ్యవహరిస్తాయి. ఆ ఎవరో అందరికీ తెలిసిందే. అవును.. పవన్ కళ్యాణ్. ఏపీ రాజకీయాల్లో ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ పేరు మోగాల్సిందే. అది మంచి అయినా చెడు అయినా సరే. ఎన్నికల సమయం అనే కాదు.. ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుల టార్గెట్ పవన్ కళ్యాణ్ అవుతూ ఉంటారు. సరిగ్గా గమనిస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (Janasena Party) పెట్టి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో పవన్ వెనుక ఎందరో తిరిగారు.. దేవుడు అన్నారు.. మళ్ళీ వారిలో చాలా మంది అబ్బే.. ఆయన రాజకీయాలకు పనికిరాడు అంటూ పక్కకి జరిగిపోయారు. జనసేన పార్టీ మీద కాపు కులం ముద్ర వేసి.. కేవలం కాపుల ఓట్లు ఆ పార్టీకి దన్నుగా ఉంటాయని భావించే టీడీపీ (TDP), వైసీపీ (YCP) రెండూ రాజకీయాలు చేస్తూ వస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ కులమే ఆయనకు శాపంగా మారినట్టు కనిపిస్తోంది.
పూర్తిగా చదవండి..AP Elections 2024: అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. టార్గెట్ పవన్ కళ్యాణ్!! ఎందుకో మరి..
ఏపీలో రాజకీయాలు ఫుల్ హై స్పీడ్ లో ఉన్నాయి. అయితే, ఇటు టీడీపీలోనూ.. అటు వైసీపీలోనూ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ప్రసంగాల్లో పంచ్ లు వేస్తున్నారు. అసలు ఎందుకు అందరూ పవన్ మీదే పడుతున్నారు? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే!
Translate this News: