MP Elections: టార్గెట్ మోడీ.. నేడు ఇండియా కూటమి కీలక భేటీ!

ఈరోజు ఇండియా కూటమి కీలక సమావేశం జరగనుంది. మరి కొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమి నేతల మధ్య చర్చ జరగనుంది. అలాగే.. నేషనల్ కన్వీనర్‌ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

New Update
MP Elections: టార్గెట్ మోడీ.. నేడు ఇండియా కూటమి కీలక భేటీ!

INDIA Alliance: ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ రోజు భేటీ కానుంది. ఉదయం 11 వర్చువల్ గా భేటీ కానున్నారు ఇండియా కూటమి నేతలు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ అంశం, కూటమి బలోపేతా నికి చేపట్టాల్సిన చర్యలను వారు చర్చించనున్నారు. వర్చువల్ గా జరిగే ఈ సమావేశంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పాల్గొనడం లేదని తెలిపింది. పలు కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉన్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. అలాగే బీహార్ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కు ఇండియా కూటమి కన్వీనర్ బాధ్యతలు అప్పగించాలని జేడీయూ నేతలు కోరుతున్నారు. అయితే జేడీయూ నేతలు అడుగుతున్న దానికి టీఎంసీ అడ్డంకు చెబుతోంది. వీటన్నింటిపై ఈరోజు జరిగే సమావేశంలో నేతలు చర్చించనున్నారు.

ALSO READ: వైసీపీ నాలుగో లిస్ట్.. ఎప్పుడంటే?

టార్గెట్ బీజేపీ..

పార్లమెంట్ ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరగనున్న తరుణంలో అన్ని పార్టీలు కార్యాచరణ మొదలు పెట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దేశ పగ్గాలను తన చేతిలో నుంచి పోకుండా ఉండేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి నేతలు ఈ సారి ఎలాగైనా కేంద్రంలో బీజేపీని గద్దె దించేలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన హావ కనబరిచింది. కాంగ్రెస్ మాత్రం కేవలం తెలంగాణలోనే అధికారాన్ని కైవసం చేసుకొని మిగితా స్థానాల్లో చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించింది. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్న పార్టీలో చర్చలు జరుపుతోంది. ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎంపీ టికెట్లపై వారితో చర్చలు జరుపుతోంది. ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతో కాంగ్రెస్ స్నేహపూర్వకంగా మెదులుతోంది.

తగ్గేదే లే.. బీజేపీ మాస్టర్ ప్లాన్..

జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి తమను ఓడించలేదని ధీమా బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి అధికారాన్ని భారత ప్రజలు తమకే కట్టబెడుతారని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రజలను ఆకట్టుకునేందుకు పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అందులో పీఎం కిసాన్ సాయం పెంపు, నిత్యావసరం ధరల తగ్గింపు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు వంటి పలు అంశాలపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉచిత రేషన్ పంపిణి కొనసాగింపు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందికు బీజేపీ అధిష్టానం ఎలాంటి హామీల వర్షాలు కురిపించనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి మరి.

ALSO READ: ఢిల్లీలో సీఎం రేవంత్.. కోటి ఆశలతో కోదండరాం!

Advertisment
తాజా కథనాలు