CM Stalin: దేశవ్యాప్తంగా కులగణన జరగాలి: సీఎం స్టాలిన్

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్‌ తెలిపారు. బీహార్‌ వంటి రాష్ట్రాల్లో కులగణన చేపట్టగా, దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు.

New Update
Tamilnadu: నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాము- స్టాలిన్

CM Stalin: కులగణనపై (Caste Census) తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Sessions) భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత జీకే మణి (Gk Mani) మాట్లాడుతూ, తమిళనాడులో కులాల వారీగా జనాభా లెక్కలను చేపట్టాలని సీఎం స్టాలిన్ ను కోరారు. దీనిపై సీఎం స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు.. ఇప్పటికే బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా కులగణన చెప్పటారని, దాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే కేంద్ర ప్రభుత్వమే తక్షణం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తాము అసెంబ్లీలో తీర్మానంచేయనున్నట్లు చెప్పారు.

Also Read: నీళ్ళ కొరకు నిరాహార దీక్ష.. విషమంగా మంత్రి ఆరోగ్యం

Advertisment
తాజా కథనాలు