చెన్నైలోని తురువల్లూర్ జిల్లా గుమ్ముడిపుందిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటిని కూల్చివేయొద్దంటూ అధికారులు, పోలీసుల ముందే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు పరిగెత్తాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేశారు. అయితే నేతాజీ నగర్లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ఆ ఇళ్లు కూల్చివేయడం ప్రారంభించారు. దీంతో ఓ వ్యక్తి తన ఇల్లు కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఇలా పోలీసులు, అధికారుల ముందే అక్కడ నిప్పంటించుకున్నాడు. దీంతో డీఎంకే ప్రభుత్వంపై బీజేపీతో సహా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
Also Read: హిందువుల కోసం ప్రత్యేక దేశం..నిత్యానంద కీలక వ్యాఖ్యలు!