Tamannaah: నా ప్రశ్నకు రాజమౌళి ఇంకా సమాధానం చెప్పలేదు.. తమన్నా!

నటి తమన్నా భాటియా దర్శకుడు రాజమౌళి 'బాహుబలి'మూవీలో అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా తనను ఎందుకు సెలక్ట్ చేశారు? అవంతిక పేరు స్పెషల్ ఏంటో ఎన్నిసార్లు అడిగినా జక్కన్న సమాధానం చెప్పట్లేదంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

Tamannaah: నా ప్రశ్నకు రాజమౌళి ఇంకా సమాధానం చెప్పలేదు.. తమన్నా!
New Update

Tamannaah Bhatia: బోల్డ్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) స్టార్ డైరెక్టర్ రాజమౌళితో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. జక్కన్న తెరకెక్కించిన 'బాహుబలి'లో (Baahubali) అవంతిక పాత్ర పోషించిన ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా తనను ఎంపిక చేసుకోవడం, క్యారెక్టర్ కు ఆ పేరు పెట్టడానికి గల సీక్రెట్స్ కు సంబంధించి ఓపెన్ అయింది.

సినిమా చరిత్రకే ఒక టర్నింగ్ పాయింట్..

రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..''బాహుబలి' సినిమా మాకే కాదు ఇండియా సినిమా చరిత్రకే ఒక టర్నింగ్ పాయింట్. ఈ మూవీ తర్వాత ప్రపంచమంతా భారతీయ సినీ పరిశ్రమ గురించే మాట్లాడుకుంది. ఇంత గొప్ప సినిమాలో రాజమౌళి (Rajamouli) నాకు అవంతిక పాత్ర అప్పగించారు. దీంతో నటిగా నిరూపించుకోవడానికి నాకు గొప్ప అవకాశం దక్కింది. అయితే ఈ పాత్రకు నన్నే ఎంపిక చేయడానికి కారణమేమిటని చాలాసార్లు అడిగాను. ఆయన ఇప్పటివరకూ ఆన్సర్ చెప్పలేదు. నేను దాని గురించి అడిగిన ప్రతిసారీ నవ్వుతుంటారు. నా ప్రతిభను రాజమౌళి అర్థం చేసుకున్నారని, ఆ పాత్రలో నటించడం మొదలుపెట్టిన తర్వాతే తెలిసింది' అంటూ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : Jayalalithaa: జయలలిత నగలు, స్థిరాస్తుల వేలం.. ఎన్నికోట్లు రానున్నాయంటే!

అలాగే ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా మాట్లాడుకుంటున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొత్తలో తన పేరు మార్పుకోవాలని సూచించినట్లు తెలిపింది. అందుకే అదనంగా తన పేరులో మరో రెండు ఇంగ్లీష్ అక్షరాలను చేర్చుకున్నట్లు చెప్పారు.

#baahubali #tamannaah #rajamouli
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe