/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Ambedkar-Statue-jpg.webp)
భారత్‌లో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఎక్కడుందంటే అందిరికీ తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న విగ్రహం కనిపిస్తోంది. ఈఏడాది అంబేద్కర్ దినోత్సవం సందర్భంగా ఏకంగా 125 అడుగులు ఉన్న ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలోనే 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు. అయితే ఇండియా వెలుపల కూడా అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అక్టోబర్ 14న ఆవిష్కరించారు. ఉత్తర అమెరికాలోని మేరీలాండ్ ప్రాంతంలో.. స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరుతో 13 ఎకరాల ప్రాంగణంలో 19 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇది సమానత్వానికి, అలాగే మానవ హక్కులకు చిహ్నంగా నిలుస్తుందని.. 'అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్' (ఏఐసీ) తెలిపింది. మరో విషయం ఏంటంటే గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి అయిన రామ్ సుతర్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు.
అయితే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇండియాతో పాటు పలు దేశాల సంతతికి చెందిన దాదాపు 500 మంది హాజరైనట్లు ఏఐసీ పేర్కొంది. 13 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో గ్రంథాలయం, కన్వెన్షన్ సెంటర్, బుద్ధ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి దళిత్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ నర్రా రవి కుమార్ హాజరయ్యారు. ప్రతి పౌరుడు కూడా సాధికారత సాధించినప్పుడే దేశం ఆర్థికంగా సుసంపన్నం అవుతుందని గతంలో అంబేద్కర్ చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి ఆ ఆర్థిక విధానమే ఇప్పుడు కార్యరూపం దాలుస్తోందని చెప్పారు.
Unveiling the statue of Dr Ambedkar at Accokeek Maryland USA pic.twitter.com/FWW2bhhlKR
— Ambedkar International Center (AIC) (@ambedkar_center) October 14, 2023