Statue of Equality: భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ.. ఎక్కడో తెలుసా..
భారత్‌లో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం తెలంగాణలోని హైదరాబద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే భారత్ వెలుపల కూడా అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమెరికాలో ఆవిష్కరించారు. ఇది సమానత్వానికి, అలాగే మానవ హక్కులకు చిహ్నంగా నిలుస్తుందని.. 'అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్' (ఏఐసీ) తెలిపింది. గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి అయిన రామ్ సుతర్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు.