Ayodhya:500 ఏళ్ళ నాటి హిందువుల కల నెరవేరుతోంది. అయోధ్యలో దివ్య రామమందిరం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ప్రపంచమంతా దీని కోసం ఎదురు చూస్తోంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం చాలా రాష్ట్రాలు సెలవులు కూడా ప్రకటించాయి. అయోధ్య రామాలయం అత్యంత సుందరంగా, అద్భుతంగా తయారైంది. మనదేశంలో అయోధ్య రామాలయమ అన్నింటికన్నా పెద్దది, గొప్పగా నిలవనుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రామాలయం మాత్రం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో తయారవుతోంది.
Also Read:వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ట వరకు అయోధ్య రామాయణం
పెర్త్‌లో నిర్మితమవుతున్న రామాలయం..
ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో రామాలయాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని ప్రపంచంలోనే అన్నికంటే ఎత్తుగా రూపొందిస్తున్నారు. దాదాపు 600 కోట్ల వ్యయంతో 721 అడగుల ఎత్తులో ఇక్కడ రామాలయాన్ని నిర్మిస్తున్నారు. 150 ఎకరాల విశాల స్థలంలో ద ఇంటర్నేషనల్ శ్రీరాం దేవిక్ అండ్ కల్యరల్ యూనియన్ ఆధ్వర్యంలో ఇది రూపుదిద్దుకుంటోంది. భారీ ఎత్తున రామమందిరాన్ని నిర్మిస్తున్నామని, ఆలయం మొత్తం ఆకర్షణీయమైన కట్టడాలతో తీర్చుదిద్దుతామని చెబుతున్నారు శ్రీరామ్ వేదిక్ కల్చరల్ ట్రస్ట్ డిప్యూటీ హెడ్ డాక్టర్ హరేంద్ర రాణా .దాంతో పాటూ పలు సౌకర్యాలుకూడా కల్పిస్తామని చెబుతున్నారు.
అదనపు ఆకర్షణలు...
రామాలయం మొత్తం ఆకర్షణగా రూపొందిస్తున్నామని అంటున్నారు నిర్వాహకులు. దీప ద్వారం, చిత్రకూట్ వాటిక, పంచవటి వాటిక పేరుతో ఉద్యనవనాలు, రామ్ నివాస్ హోటల్, సీతా రసోయి రెస్టారెంట్, రామాయణ సదన్ గ్రంథాలయం, తులసీదాస్ హాల్ లుకూడా ఉంటాయని తెలిపారు. ఇవి కాక యోగా కేంద్రం, ధ్యాన మందిరం, వేద అధ్యయనం, పరిశోధన కేంద్రం, మ్యూజియం కూడా ఉంటాయని తెలిపారు. పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ ఆలయం మొత్తం సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. ప్రకృతిలో, ఆహ్లాదంగా ఉండేలా రామాలయం నిర్మాణం జరుగుతుందని డాక్టర్ హరేంద్ర రాణా వెల్లడించారు.