Flax : అవిసెల్ని ఇలా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు చాలా లాభాలున్నాయ్.. పెరిగిన అవగాహన కారణంగా అవిసెల్ని చాలా మంది తీసుకుంటున్నారు.అవిసెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి. By Durga Rao 23 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Flax Seeds : అవిసె(Flax) ల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్(Omega 3 Faty Acids) తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అవాంఛిత కొలెస్ట్రాల్ కరుగుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి అవిసెలు చాలా మంచివి. వీటిని ఎలా తీసుకుంటే ఏమేం ప్రయోజనాలో తెలుసుకోండి. అవిసెల్లోని గొప్ప గుణాల కారణంగా వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే మలబద్ధకం(Constipation) దూరమవుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో పాటు బరువు తగ్గడాని హెల్ప్ అవుతుంది. ఇందులోని గుణాలు స్కిన్, హెయిర్‌కి చాలా మంచిది.చాలా మందికి ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది. బిజీగా ఉన్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. అయితే, దాని బదులు మీరు స్మూతీస్‌ని ట్రై చేయొచ్చు. ఇందుకోసం మీకు నచ్చిన పండ్లని తీసుకుని అందులో పాలు కలిపి కొద్ది అవిసెలని వేసి తీసుకోవడం. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి, శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి. ఈ నీటిని రాత్రి పడుకునే ముందు తీసుకోవచ్చు. ఇందుకోసం పడుకునే ముందు ఓ గ్లాసు నీటిలో ఓ టీస్పూన్ అవిసెలని వేసి ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి తాగొచ్చు.జీర్ణక్రియని మెరుగుపరచడంలో పెరుగు ముందుంటుంది. ఇది మంచి ప్రోబయోటిక్ ఫుడ్. దీనిని తీసుకుంటే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇక ఇందులోని గుణాలను పెంచాలంటే పెరుగులో అవిసెల్ని కలిపి తినాలి. దీనిని స్నాక్‌లా తినొచ్చు. ఈ స్నాక్‌లో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డీలు ఉన్నాయి.ఈ టీని సాధారణ టీలానే చేస్తారు. ఇందుకోసం ఓ గిన్నెలో రెండు గ్లాసు నీటిని తీసుకుని మరిగించండి. అందులో చిటికెడు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసి ఓ గ్లాసు అయ్యేవరకూ దానిని మరిగించండి. ఇప్పుడు దానిని వడకట్టి అందులో నిమ్మరసం, తేనె వేసి బాగా మిక్స్ చేసి తాగాలి. Also Read : ఇలా చేస్తే మీ కళ్లు పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి #health-benefits #best-health-tips #flax-seeds #constipation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి