Phalguna Amavasya 2024 : ఫాల్గుణ అమావాస్య రోజు ఇలా చేశారంటే ఎంతో పుణ్యం ఫాల్గుణ అమావాస్య (ఆదివారం) రోజున పుణ్యక్షేత్రంలోని పవిత్ర నదిలో స్నానం చేయడం, దానధర్మాలు, శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పూర్వీకులు, దేవతల అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. పితృ దోషం నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇది మంచి రోజు అని పండితులు అంటున్నారు. By Vijaya Nimma 08 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Phalguna Amavasya Benefits : ఫాల్గుణ అమావాస్య(Phalguna Amavasya) నాడు పూర్వీకులను ఆరాధించడం, దానాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం ద్వారా పూర్వీకులతో పాటు లక్ష్మీదేవి(Lakshmi Devi) అనుగ్రహాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఫాల్గుణ అమావాస్య మార్చి 9 లేదా 10వ తేదీన వస్తుంది. ఫాల్గుణ అమావాస్య గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫాల్గుణ అమావాస్య: అమావాస్య తిథికి అధిపతిని పూర్వీకులుగా పరిగణిస్తారు. ఏడాదికి మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. ఈ రోజున పుణ్యక్షేత్రంలోని పవిత్ర నదిలో స్నానం చేయడం, దానధర్మాలు, శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పూర్వీకులు, దేవతల అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. పితృ దోషం నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇది మంచి రోజు అంటున్నారు. ఫాల్గుణ అమావాస్య ఎప్పుడు? పంచాంగం ప్రకారం ఫాల్గుణ అమావాస్య 9 మార్చి 2024న సాయంత్రం 6.17 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 10 మార్చి 2024న మధ్యాహ్నం 2.29 గంటలకు ముగుస్తుంది. గ్రంధాలలో ఉదయతిథి ప్రకారం అమావాస్య చెల్లుతుంది. అందుకే ఫాల్గుణ అమావాస్య మార్చి 10న ఉంటుందని పండితులు చెబుతున్నారు. పితృ పూజ చేయండి: ఫాల్గుణ అమావాస్య నాడు ఒక కుండలో నీరు, తెల్లటి పువ్వులు, నల్ల నువ్వులు వేసి పూర్వీకులకు నీళ్లు సమర్పించాలి. అరచేతిలో నీటిని తీసుకొని బొటనవేలు వైపు నుంచి సమర్పించండి. పురాణ గ్రంథాల ప్రకారం అరచేతిలో బొటనవేలు ఉన్న భాగాన్ని పితృ తీర్థం అంటారు. తర్పణం చేయడానికి ఉత్తమ సమయం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు సంతృప్తినిస్తుందని, వారసులకు శ్రేయస్సును ప్రసాదిస్తారని నమ్ముతారు. ఆర్థిక సంక్షోభం పోతుంది: 5 పువ్వులు, 5 దీపాలు ఫాల్గుణ అమావాస్య రాత్రి ప్రవహించే నది(River) లో దీపం పెట్టి పువ్వులను వదిలితే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. విజయానికి దారులు తెరుచుకుంటాయని పండితులు అంటున్నారు. అంతేకాకుండా బ్రాహ్మణుడికి ఆహారం, డబ్బు దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే ఏం పండ్లు తినాలి..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #health-benefits #best-health-tips #river-bath #phalguna-amavasya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి