లంచాలతోనే ఆఫీసుకు రండి.. ఏపీలో తహసిల్దార్ నిర్వాకం.. వీడియో వైరల్ శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర తహసిల్దార్ ముష్రా వలీ బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్న వీడియో వైరల్ అవుతోంది. రాముడి కాలంలోనూ లంచం ఉందని, ఏ నాయకుడు లంచం లేకుండా పనిచేశారో చూపించాలంటూ బాధితులపైనే అసహనం వ్యక్తం చేశాడు. By srinivas 24 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ Uncategorized New Update షేర్ చేయండి Mushra Vali : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా(Sri Satyasai District) లో ఓ ఆఫీసర్ బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్న సంఘటన సంచలనం రేపుతోంది. ఎలాంటి పనుల కోసమైనా సరే తహసిల్దార్(Tahsildar) కార్యాలయానికి లంచం తీసుకుని రావాలని స్వయంగా తహసిల్దార్ హుకుం జారీచేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి వస్తే శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర తహసిల్దార్ ముష్రా వలీ భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్య పరిష్కారాల కోసం వెళితే లంచాలు ఇవ్వాలని వేధిస్తున్నారని, ఇవ్వని వారి పనులను పెండిగ్ లో ఉంచి కాళ్లు అరిగేలా తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని చెబుతున్నారు. ఇది కూడా చదవండి : పవన్ కల్యాణ్ కు అంత సీన్ లేదనుకున్నా.. శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్ అంతేకాదు ఉన్నతాధికారులు వచ్చినప్పుడు వారి ఖర్చులు ఎవరు భరించాలని స్వయంగా ముష్రా వలీ చెప్పడం విశేషం. కాగా కార్యాలయం నిర్వహణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయని, ఈనెల 13వ తేదీ టెక్స్ టైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత పర్యటన వచ్చినప్పుడు ఆమె భోజనం ఖర్చు లక్ష 70 వేల రూపాయలు అయిందని ముష్రావలి వాపోయాడు. అలాఏ రాముడి కాలంలోనూ లంచం ఉందని, ఏ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి లంచం లేకుండా పనిచేశారో చూపించాలంటూ బాధితులపైనే అసహనం వ్యక్తం చేశాడు. అలాగే పై అధికారులు వచ్చినపుడు వాళ్ల కోసం అయ్యే ఖర్చులు తన జీతం నుంచి ఇవ్వాలా అని ఎదురు ప్రశ్నించిన అధికారి.. అందుకే రైతుల నుంచి లంచాలు తీసుకుంటున్నానంటూ తెగెసి చేప్పేశాడు. ఇక ప్రస్తుతం తహసిల్దార్ మాట్లాడిన వివాదాస్పద వీడియో వైరల్ అవుతోంది. Your browser does not support the video tag. ఇక దీనిపై స్పందిస్తున్న ప్రజలు.. రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి బహిర్గతంగా కనిపిస్తుంటే పై అధికారులు ఏం చేస్తున్నారని వాపోతున్నారు. ఇంత బహిరంగంగా లంచం డిమాండ్ చేసే స్థాయికి రెవెన్యూ అధికారులు వచ్చారంటే వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చని, వెంటనే ఇలాంటి వారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. #corruption #sri-sathyasai #madakasira #tahsildar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి