CM Jagan: ఏపీ సీఎంకి ఎంఆర్ఐ స్కానింగ్!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఆయన విజయవాడలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఆయన విజయవాడలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
చంద్రబాబు, వపన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. నారా లోకేష్ యాత్రకు ప్రజా స్పందన కరువైందని వెల్లంపల్లి ఆరోపించారు. టీడీపీ ఎంపీలు సైతం యువగళం యాత్రను బహిష్కరించారని విమర్శించారు.
చౌలురు మధుమతి కూడా తన సోదరుడు చౌలూరు రామకృష్ణా రెడ్డి బాటలోనే ప్రయాణిస్తున్నారు. ఆమె కూడా సోదరుడిలాగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా ఎదుగుతున్నారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణను ఓడిస్తామని అంటున్నారు. కంచుకోటలో టీడీపీని ఓడిస్తామని పేర్కొంటున్నారు.
ఏపీలో 35 సర్పంచ్ స్థానాలకు,245 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఏలూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయి. కడప జిల్లా సుగమంచిపల్లె వాసులు ఎన్నికలను బహిష్కించారు. పంచాయతీఎన్నికలు ఎలా సాగుతున్నాయంటే...
గన్నవరం వైసీపీ సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. యార్లగడ్డ వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ కోసం పని చేయాలన్నారు. తమకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలన్నారు. ఒక పదవి కోసం 50, 100 పోటీ చేసే పరిస్థితి ఉందన్నారు సజ్జల. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. ఇటువంటి అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించాలి.. కానీ ఇలా బహిరంగంగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా ఒక నిర్ణయం తీసుకునే ఇప్పుడు ఈ ప్రకటనలు చేశారు అనిపిస్తోందని అన్నారు సజ్జల.
ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తూంటే విపక్ష నాయకులు, జనసేన అధ్యక్షుడు పవన్ చూసి ఓర్వలేకపోతున్నారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన అంటున్న మాటలు వింటుంటే ఈ ప్రాంతం అంతా వెనకబడి ఉంటేనే ఆయనకు నచ్చేటట్లుగా ఉందని ఆయన ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం పై విజయసాయి రెడ్డి స్పందించారు.