జగన్ కి కృతజ్ఙతలు తెలిపిన భూమన!
టీటీడీ కొత్త చైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
టీటీడీ కొత్త చైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సారా సొమ్ముతో చంద్రబాబు జూబ్లీహిల్స్ లో 300 కోట్లతో భవనం నిర్మించారని, అందుకే నారా లోకేష్ ను సారా లోకేష్ అంటారని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. యరపతినేని అనే పెద్ద మనిషి జనాభాను లూటీ చేసి..గుంటూరులో రూ.50 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు అంటూ ఆరోపించారు.
చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పేద ఇంటి ఆడపిల్లల పెళ్లికి వైఎస్సాఆర్ కళ్యాణమస్తు, వైఎస్సాఆర్ షాదీ తోఫా పథకాల కింద మరోసారి లబ్ధిదారులకు అందజేయనుంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఓ గ్రామీణ పేద విద్యార్థి కలను సాకారం చేసేందుకు మరోసారి ఆర్థిక భరోసా అందించారు. పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి అమెరికాలో ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణకు ఎంపికయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.చిత్తూరు జిల్లా పర్యటనలో పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పెద్దిరెడ్డిని నిలదీస్తూ ఏం పుంగనూరు పుడింగివా అంటూ బాబు పెద్దిరెడ్డిని నిలదీశారు. అంతే కాకుండా చంద్రబాబుని పుంగనూరులో అడుగు కూడా పెట్టనివ్వలేదు.
వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజలకు తాగు నీరు పేరుతో కోట్ల రూపాయలు ట్యాంకర్లకు ఖర్చు పెట్టామని అబద్దాలు చెబుతోన్న లోకేష్.. దొచుకున్న లెక్కల వివరాలను బయట పెట్టాలన్నారు ఎమ్మెల్యే బొల్లా. అడ్డదారిలో ముఖ్యమంత్రిగా, మంత్రిగా అవతరించిన చంద్రబాబు, లోకేష్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిని రాజధానిని చేస్తానని చెప్పి గ్రాఫిక్స్ చూపించారని.. కానీ చివరికి చేతులెత్తేశారని విమర్శించారు. వినుకొండ ప్రజలకు తాగునీరు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఎమ్మెల్యే నిలదీశారు..