మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్
గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. అతనితో పాటు తన కుమారుడుకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు.
పవన్ ఇలాకాలో గ్రామ బహిష్కరణ.. || Kula Bahishkarana In Pithapuram || Deputy CM Pawan Kalyan || RTV
మెగా ఫ్యామిలీలో మళ్లీ చిచ్చు.. జగన్ ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్ ఫొటోలు!
జగన్ పుట్టినరోజు బ్యానర్లో అల్లు అర్జున్ ఫోటో కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటోను వైసీపీ క్యాడర్ ఏర్పాటు చేసింది. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ దగ్గరవుతున్న టైమ్‌లో వైసీపీ బ్యానర్లు హాట్ టాపిక్‌గా మారాయి.
చెల్లెమ్మకు చెక్.. షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ సంచలన వ్యూహం!
విమర్శలు, ఆరోపణలతో పంటి కింద రాయిలా మారిన చెల్లి షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు YCPలో చేరేలా జగన్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఆయనే స్వయంగా ఆయా నేతలతో చర్చలు జరుపుతున్నట్లు చర్చ సాగుతోంది.
Vijaysai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు!
AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ఆయనను అరెస్ట్ చేయాలని కోరారు. ఒకవేళ దీనిపై చర్యలు తీసుకోకపోతే తాను కోర్టుకు కూడా వెళ్తానని చెప్పారు.
AP High Court: హైకోర్టులో సజ్జలకు ఊరట!
AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు కాస్త ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి మరోసారి పొడిగించారు. తదుపరి విచారణను డిసెంబర్ 9కు వాయిదా వేసింది.
YCP: చంద్రబాబు రాళ్ల దాడి కేసులో వైసీపీ నేతలు.. వారితో భారీ డీల్!
చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిలో వైసీపీ నేతల హస్తం ఉందని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. 3 టీమ్ లు కుట్రకు పాల్పడ్డాయని ఏసీపీ తిలక్ తెలిపారు.