/rtv/media/media_files/2025/09/24/ycp-book-2025-09-24-17-32-21.jpg)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ కార్యకర్తలను, నాయకులను అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తుందంటూ వైసీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. బాధితులను కూడా జగన్ నేరుగా వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తల ఫిర్యాదు కోసం వైసీపీ డిజిటల్ బుక్ యాప్, వెబ్ సైట్ ను బుధవారం గ్రాండ్ గా లాంచ్ చేశారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు.
అనంతరం జగన్ మాట్లాడుతూ.. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం దీన్ని తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాన్నారు జగన్. ఈరోజు కూటమి సర్కార్ రెడ్‌బుక్ అంటుందని, రేపు మనం డిజిటల్ బుక్ ఏమిటన్నది చూపిస్తామని జగన్ చెప్పుకొచ్చారు.
ఈ యాప్ https://digitalbook.weysrcp.com/auth/phone లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది . ఈ యాప్ ద్వారా ఎవరైనా తాము ఎదుర్కొన్న అన్యాయానికి సంబంధించిన వివరాలను నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు. వెబ్‌సైట్‌తో పాటు, 040-49171718 ద్వారా IVRS కాల్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడింది. అంటే బాధితులు ఎవరైనా కూడా ఫోన్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు అన్నమాట.
యాప్ ద్వారా
- బాధితులు ముందుగా తమ ఫోన్ నంబర్ ద్వారా పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- ఆ తరువాత ఒక డ్యాష్‌బోర్డ్ కనిపిస్తుంది. అందులో తమకు జరిగిన అన్యాయం, రాజకీయ వేధింపులు, అక్రమ కేసులు, లేదా ఇతర సమస్యల గురించి వివరంగా నమోదు చేయవచ్చు.
- ఇందులో లోకేషన్ యాక్సెస్ ఉంటుంది. అలాగే కెమెరా యాక్సెస్ కూడా ఉంటుంది. సమస్యకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను అప్‌లోడ్ చేసే చేయాలి.
- నమోదు చేసిన ప్రతి ఫిర్యాదును ఒక పర్మనెంట్ డిజిటల్ డైరీలో శాశ్వతంగా భద్రపరుస్తారు.
- భవిష్యత్తులో ఈ సమాచారం ప్రకారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
కాల్ చేసి ఫిర్యాదు
- ఇక ఇంటర్నెట్ సౌకర్యం లేనివారు లేదా వెబ్‌సైట్ ఉపయోగించలేని వారు ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
- కాల్ చేసిన తర్వాత, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా వారు తమ సమస్యలను వాయిస్ రూపంలో రికార్డ్ చేస్తారు.
- ఈ వాయిస్ రికార్డింగ్ కూడా డిజిటల్ బుక్‌లో నమోదు అవుతుంది.
- వాయిస్ రికార్డింగ్ పూర్తయిన తర్వాత, ఆటోమేటెడ్ సిస్టమ్ వారికి ఒక ఫిర్యాదు రిఫరెన్స్ నెంబర్‌ను ఇస్తుంది.
- ఈ డిజిటల్ డేటా భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది.