Israel-Hamas war:ఒప్పందం ముగిసింది..మళ్ళీ కాల్పులు మొదలయ్యాయి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పదం ముగిసిపోయింది. అది అయిన క్షణాల్లోనే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేసింది. ఈరోజు దాడిలో నలుగురు చిన్నారులు, మరో ఐదుగురు పాలస్తీనియన్లు చనిపోయారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పదం ముగిసిపోయింది. అది అయిన క్షణాల్లోనే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేసింది. ఈరోజు దాడిలో నలుగురు చిన్నారులు, మరో ఐదుగురు పాలస్తీనియన్లు చనిపోయారు.
మొత్తానికి సంధి కుదిరింది...గాజా మీద ఆరు వారాలుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగివచ్చింది. నాలుగురోజుల పాటూ కాల్పులను విరమించేందుకు అంగీకరించింది. దీనికి బదులుగా తమ చెరలో ఉన్న 50 బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ ఒప్పుకుంది.
గాజాలో ఇళ్ళు, ఆస్పత్రుల కింద హమాస్ స్థావరాలున్నాయని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెబుతోంది. దానికి నిదర్శనంగా ఈరోజు ఓ వీడియోను పోస్ట్ చేసింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ టన్నెల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.
హమాస్-ఇజ్రాయెలకు మధ్య జరుగుతున్న వార్ లో లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ ఎంటర్ అయింది. ఇజ్రాయెల్ మీద రాకెట్లతో విరుచుకుపడింది. ఇందులో 7గురు సైనికులతో పాటూ 10 మంది ఇజ్రాయెల్ పౌరులకు గాయాలయ్యాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మీద భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్ లో మాట్లాడారు. ద్విదేశ పరిష్కారాన్ని పునరుద్ఘాటించారు.
గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇళ్ళు, ఆసుపత్రులు...అన్నింటి మీదా దాడి చేస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రి మీ దాడి చేయగా 15 మంది చనిపోయారు. మరో 60 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాలో బీభత్సం సృష్టిస్తోంది. ఈక్రమంలో తమ దేశానికి చెందిన ఓ సైనికురాలిని సైన్యం విడిపించుకుంది. మరోవైపు గాజాలో కాల్పుల విరమణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అమాయక , సామాన్య ప్రజలు మరణించడం మీద భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధాన్ని ఆపి, శాంతిని స్థాపించేందుకు ఇరు వర్గాలు మళ్ళీ చర్చలకు రావాలని పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థిలు మీద ఐరాస భద్రతా మండలిలో జరగిన చర్చలో ఇండియా ఈ వ్యాఖ్యలను చేసింది.