Israel attacks:ఆసుపత్రి మీద దాడి చేసిన ఇజ్రాయెల్..15 మంది మృతి
గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇళ్ళు, ఆసుపత్రులు...అన్నింటి మీదా దాడి చేస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రి మీ దాడి చేయగా 15 మంది చనిపోయారు. మరో 60 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇళ్ళు, ఆసుపత్రులు...అన్నింటి మీదా దాడి చేస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రి మీ దాడి చేయగా 15 మంది చనిపోయారు. మరో 60 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాలో బీభత్సం సృష్టిస్తోంది. ఈక్రమంలో తమ దేశానికి చెందిన ఓ సైనికురాలిని సైన్యం విడిపించుకుంది. మరోవైపు గాజాలో కాల్పుల విరమణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అమాయక , సామాన్య ప్రజలు మరణించడం మీద భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధాన్ని ఆపి, శాంతిని స్థాపించేందుకు ఇరు వర్గాలు మళ్ళీ చర్చలకు రావాలని పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థిలు మీద ఐరాస భద్రతా మండలిలో జరగిన చర్చలో ఇండియా ఈ వ్యాఖ్యలను చేసింది.
నిన్నటి వరకు ఒక లెక్క...ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు. నిన్నటి వరకు క్షిపణులు, వైమానికి దాడులు చేసుకున్న ఇరు వర్గాలు మొదటిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. నిన్న గాజాలో ముఖాముఖి పోరు చేసుకున్నామని హమాస్ సైనిక విభాగం అల్-ఖసమ్ బ్రిగేడ్స్ చెప్పింది.
యుద్ధాలు ఎప్పుడూ మానవ మనుగడకు ప్రమాదమే. ఇవి మనుషులకు ఎప్పుడూ శాంతిని ఇవ్వలేవు. యుద్ధం అయిపోయాక భవిష్యత్తులో చరిత్ర పాఠాలుగా చదువుకోవచ్చునేమో కానీ అది జరుగుతున్నప్పుడు మాత్రం అన్నిరకాలుగా నష్టమే తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఇందుకు నిదర్శనమే ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య వార్.
హమాస్‌ను మట్టుబెట్టే లక్ష్యంతో ముందుకు వెళుతోంది ఇజ్రాయెల్. క్షిపణులు, వైమానిక దాడులతో గాజా మీద విరుచుకుపడుతోంది. సరిహద్దుల్లో మరింత సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించింది. భూదాడులు నిర్వహించి హమాస్‌ను సమూలంగా నాశనం చేయాలనే అనుకుంటోంది. కానీ గాజాలో భూదాడులు చేయడం అంత ఈజీ కాదని నిపుణులు అంటున్నారు. గాజా కింద మరో గాజా ఉందని చెబుతున్నారు.
ఇజ్రయెల్, హమాస్ మారణకాండలో సామాన్య పాలస్తీనియన్లు బలౌతున్నారు. ఎవరు ఎంత చెబుతున్నా ఇరుపక్షాలు యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు. శత్రువుల కోసం వేటాడుతున్న ఇజ్రాయెల్ గాజా మీద ఎడాపెడా క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది. దీంతో అక్కడ బీభత్స వాతావరణ నెలకొంది. తాజాగా ఖాన్ యూనిస్‌లో ఓ భవనం మీద బాంబును వేయగా అందులో ఉన్న 15 మంది చనిపోయారు. దాదాపు 40 మంది గాయాలపాలయ్యారు.
ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య యుద్ధం మొదలై దాదాపు పది రోజులు. ఇన్ని రోజులుగా నరమేధం జరుగుతూనే ఉంది. హమాస్ మొదలెట్టిన ఈ భీభత్సాన్ని ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ ఇజ్రాయెల్ కే సపోర్ట్ గా ఉన్నాయి. హమాస్ చర్యలను ఖండిస్తున్నాయి. తాజాగా హమాస్ దారుణాలకు మాకు సంబంధం లేదు అంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కూడా ప్రకటించారు.
హమాస్ టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేయాలని డిసైడ్ అయింది. గాజాను నేలమట్టం చేసేందుకు భారీ ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు వైమానిక దాడికి మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ ఇప్పుడు భూమార్గంలో కూడా దాడులకు పాల్పడాలని అనుకుంటోంది.