Hardik Pandya : పాండ్యా పేరుతో దద్దరిల్లిన వాంఖడే స్టేడియం.. అప్పుడేమో 'ఛీ' కొట్టి, ఇప్పుడు 'జై' కొట్టి..!
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అవమానాలు ఎదుర్కొన్న పాండ్యా.. ఇప్పుడు తనను గేలి చేసిన అభిమానులందరి మనుసు గెలుచుకున్నాడు. అందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో మార్మోగుతున్న హార్దిక్ హార్దిక్ నినాదాలే అందుకు సాక్ష్యం. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.