Ex CM Jagan : వరద బాధితులకు రూ.కోటి సాయం ప్రకటించిన జగన్
వరద బాధితులకు వైసీపీ తరఫున ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ రూ.కోటి ప్రకటించారు. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడలో వరద పరిస్థితిపై ముఖ్యనేతలతో కలిసి జగన్ ఈరోజు సమీక్షించారు.