Vijayawada Floods: కనీ, వినీ ఎరుగని వరదలివి. ఒక్కసారిగా కృష్ణమ్మ ఉప్పొంగిపోయింది. కృష్ణా నదిలో సంగమించే మున్నేరు.. బుడమేరు ఉగ్రరూపం దాల్చాయి. కుండపోత వానలతో వాన నీరు వరదనీరుగా మారి ఊళ్లను.. విజయవాడ నగరంలోని పలు కాలనీలను ముంచెత్తింది. గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అతి పెద్ద వరదల్లో ఇప్పుడు విజయవాడ వరద కూడా వచ్చి చేరింది. విజయవాడ నగరంలో 40% పైగా ప్రాంతము వరద ముంపునకు గురయింది. నగరం చుట్టూ ఉన్న రెండు నదులు, కృష్ణా – బుడమేరు ఒడ్డు దాటి నగరాన్ని ముంచెత్తాయి. విజయవాడలో ఎప్పుడూ వరద అంటే తెలియని చాలా ప్రాంతాలు కూడా ఈసారి వరదల్లో మునిగిపోయాయి అంటే వరద తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. ఈ వరదలు ఎన్టీఆర్ జిల్లాలో 2.76 లక్షల మంది ప్రజలను ప్రభావితం చేశాయి. అల్పపీడన వ్యవస్థతో ప్రేరేపితమైన కుండపోత వర్షాలు గత ఐదు రోజులుగా నగరం – రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కుంభవృష్టి ప్రభావిత జిల్లాల పరిపాలన కుంటుపడింది.
పూర్తిగా చదవండి..Vijayawada Floods: రెండు దశాబ్దాల్లోనే అతిపెద్ద వరద.. విలవిల్లాడుతున్న విజయవాడ!
రాష్ట్రంలో రెండు దశాబ్దాల్లో వచ్చిన అతి పెద్ద వరదల్లో ఒకటిగా ప్రస్తుత విజయవాడ వరద చేరింది. కుండపోత వానలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ దాదాపు 40% మునిగిపోయింది. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
Translate this News: