Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక నుంచి అక్కడ కూడా టికెట్ కౌంటర్!
శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు.. ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని ఈవో శుక్రవారం పరిశీలించారు.