Chiranjeevi: చిరుతో ముగ్గురు టాప్ డైరెక్టర్స్..! ఆ సినిమాల లిస్ట్ ఇదే..?
భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ అయిన ఆ ముగ్గురి తో సినిమాలకు ఒకే చెప్పారు. ప్రస్తుతం వాటి పనుల్లో బిజీగా ఉన్నారు.
భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ అయిన ఆ ముగ్గురి తో సినిమాలకు ఒకే చెప్పారు. ప్రస్తుతం వాటి పనుల్లో బిజీగా ఉన్నారు.
పెద్ద సినిమాలన్నీ మరోసారి సెట్స్ పైకి వచ్చాయి. చకచకా షూటింగ్స్ పూర్తిచేసే పనిలో పడ్డాయి. ఆగస్ట్ 15 శెలవులు, అంతకంటే ముందు వర్షాల కారణంగా కొన్ని సినిమాల షూటింగ్స్ ఆగాయి. అలాంటి మూవీస్ అన్నీ ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్స్ స్టార్ట్ చేశాయి. మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా చాలామంది హీరోల సినిమాలు చకచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోంది గుంటూరుకారం సినిమా. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో కానీ, ప్రారంభం నుంచి ఓ రకమైన అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాపై షూటింగ్ అప్ డేట్స్ కంటే, పుకార్లే ఎక్కువగా వచ్చాయి. దీనికితోడు హీరోయిన్ మార్పులు, ఫైట్ మాస్టర్ మార్పులు లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వాటికంటే ముందు, ఏకంగా కథనే మార్చేసిన సంగతి చాలాకొద్ది మందికి మాత్రమే తెలిసిన నిజం.