Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ 'వందే భారత్' రద్దు.. ప్రయాణికుల అసంతృప్తి
విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ రద్దు అయ్యింది. టెక్నికల్ రీజన్స్ తో ఈ రైలును గురువారం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన చేశారు. ఆగష్టు 17 ఉదయం 5.45కి ఈ రైలు బయలు దేరాల్సి ఉంది. ఈ రైలు ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 7 గంటలకు బయలు దేరింది. ఈ రైలు కేవలం వందే భారత్ స్టాపుల్లో మాత్రమే ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు ఏవైనా అనుమానాలు ఉంటే .. వెంటనే ఆయన రైల్వే స్టేషన్ లలో రైల్వే శాఖ అధికారులను వివరాలను అడిగి తెలుసుకోవాలని సూచించింది విశాఖ రైల్వే శాఖ.