నేడు చంద్రమోహన్ అంత్యక్రియలు.. అంతిమయాత్ర రూట్ ఇదే ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్ నగర్లోని తమ ఇంటి నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. By srinivas 13 Nov 2023 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం జరగనున్నాయి. శనివారం ఉదయం మరణించిన ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్ నగర్లోని తమ ఇంటి నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆయన అంతిమయాత్ర మొదలుకానుండగా ప్రముఖులు, సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. Also read :ధాబాలో దారుణం.. దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమానిని ఏం చేశారంటే? ఇక కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆస్పత్రిలోనే కన్నుమూశారు. అయితే తనకు ఇద్దరూ కూతుళ్లుండగా పెద్దమ్మాయి తన ఫ్యామిలీతో అమెరికాలో ఉంటున్నారు. దీంతో ఆమె కోసం పార్థివదేహాన్ని రెండు రోజులుగా ఫిల్మ్ నగర్లోని చంద్రమోహన్ ఇంటివద్దే ఉంచారు. అయితే తాజా సమాచారం ప్రకారం చంద్రమోహన్ పెద్ద కుమార్తె అమెరికా నుంచి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మండే మార్నింగ్ మొదలుకానున్న అంతిమ సంస్కారాలను చంద్రమోహన్ తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే పరిశ్రమకు చెందిన వ్యక్తులు, తదితర సన్నిహితులు చాలామంది చంద్రమోహన్ ఇంటికి వచ్చి అతనికి నివాళులు అర్పించారు. దీంతో తెలుగు ఫిలిం ఛాంబర్ దగ్గర ఆగకుండా అంతిమయాత్రను 12 గంటల వరకూ పంజాగుట్ట శ్మశాన వాటికకు తరలించబోతున్నట్లు సన్నిహితులు తెలిపారు. #last-rites #chandramohan #route #this-is-the-final-journey #today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి