Mahua Moitra : మహువా ఇంటికి వెళ్లిన అధికారులు.. చివరికి
బహిష్కృత టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి వెళ్లారు. ఆమె వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. అప్పటికే మహువా బంగ్లా ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు ఆమె న్యాయవాది తెలిపారు.