Mahua Moitra: ఒత్తిడి చేసి బలవంతంగా సంతకం చేయించారు.. మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ సమావేశాల్లో అదానిపై ప్రశ్నలు అడిగేందుకు తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి, ఈ నేపథ్యంలోనే మహువా ఎక్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం.. హీరానందానిపై ఒత్తిడి తీసుకొచ్చి తెల్లకాగితంపై అందులో సంతకం చేయించిందని పేర్కొన్నారు. ఆ కాగితంలో ఉన్న సమాచారమే ఆ తర్వాత మీడియాకు లీక్ అయినట్లు పేర్కొన్నారు.