Telangana : భర్తకు గుడి కట్టించిన భార్య.. ఎక్కడంటే
మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారులోని సోమ్లా తండాలో బానోతు హరిబాబు అనే వ్యక్తి మూడేళ్ల క్రితం కరోనా బారిన పడి మృతి చెందాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆయన భార్య.. తన భర్త రూపం ఎప్పటికీ కనిపించాలని విగ్రహాన్ని తయారు చేయించి గుడి కట్టించింది.