అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..నవంబర్ 17 నుంచి తెరుచుకుంటున్న శబరిమల ఆలయం!
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆలయాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు . ఈ నెల 17 నుంచి అయ్యప్ప ఆలయం తెరచుకోనున్నట్లు మంత్రి రాధాకృష్ణ వెల్లడించారు.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆలయాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు . ఈ నెల 17 నుంచి అయ్యప్ప ఆలయం తెరచుకోనున్నట్లు మంత్రి రాధాకృష్ణ వెల్లడించారు.
కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి గుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళారు. సెంటిమెంట్ ప్రకారం నామినేషన్ పత్రాలను దేవుడి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయ్యింది.కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వాములకు, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం అంటే ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామి వారికి మన కోరికలు చెవిలో చెబితే చాలు ఆయన వాటిని విని వెంటనే తీరుస్తాడని ఓ నమ్మకం.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలడాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు రోడ్లో గల శ్రీ విజయ దుర్గ అమ్మవారు ధనలక్ష్మి దేవిగా దర్శనం ఇచ్చారు.
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలకు 24 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయినట్టు సీఎం సుఖ్వీందర్ సింగ్ తెలిపారు. గత రాత్రి సోలన్ జిల్టాలో క్లౌడ్ బరస్ట్ వల్ల ఏడుగురు మరణించినట్టు పేర్కొన్నారు. ఇక సిమ్లాలో శివాలయంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
కెనడాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రే టౌన్ లోని ప్రముఖ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు కూల్చి వేశారు. ఇక కెనడాలో ఆలయంపై దాడి జరగడం ఇది నాలగవ సారి. ఈ ఏడాది ఏప్రిల్ లో ఒంటారియాలోని స్వామి నారాయణ్ ఆలయంపై దాడి జరిగింది. అంతకు ముందు ఫిబ్రవరిలో కెనడాలోని రామ మందిర్, జనవరిలో బ్రాంప్టన్ ఆలయంపై ఖలీస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేశారు.