రాజకీయాలు Telangana Elections: కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ మాస్ సెటైర్లు.. సిరిసిల్ల రాజకీయలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో మాట్లాడిన ఆయన.. తాను అభివృద్ధి చేయకపోతే తనకు ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ఎవరెవరో వచ్చి ఏదేదో చెబుతారని, ఆగం కావొద్దని ప్రజలను కోరారు. తాను చేసిన పని కళ్ల ముందు కనపడుతోందన్నారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఆగం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు మంత్రి. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: దూకుడు పెంచిన కాంగ్రెస్.. తెలంగాణలో ఖర్గే, డీకే శివకుమార్ ప్రచారం.. తెలంగాణలో ఈసారి అధికారం తమదే అంటున్న కాంగ్రెస్ పార్టీ.. మరింత దూకుడు పెంచింది. పార్టీ అగ్ర నేతలను ప్రచార పర్వంలోకి దించింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వస్తున్నారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నారు. చేవెళ్ల, పరిగి, తాండూరు, సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ లో వీరు ప్రచారం చేస్తారు. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో గురువారం రాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్‌లు కూడా కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం వీరు.. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను కలవనున్నారు. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: డబ్బులు అనుకుని బుల్లెట్లు ఎత్తుకెళ్లాడు.. కట్ చేస్తే డబుల్ ట్విస్ట్.. రైల్వే స్టేషన్ లో చోరీకి గురైన ఇన్సాస్ గన్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ బుల్లెట్లను ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. అయితే, విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కానిస్టేబుల్ వద్దనున్న బ్యాగ్ చూసి డబ్బుల ఉన్నాయని అనుకుని చోరీకి పాల్పడ్డాడట దొంగ. ఓపెన్ చేయగా బుల్లెట్లు ఉండటంతో.. అక్కడే వదిలేశాడు. మరో వ్యక్తి ఆ బుల్లెట్లను తీసుకెళ్లి ఇంట్లో దాచిపెట్టాడు. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఆ ఒక్క మాట వల్లే కొట్టాను.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే వివేకానంద.. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ పై చేయి చేసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై తాజాగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందించారు. గొడవపై వివరణ ఇచ్చారు. శ్రీశైలం తన తండ్రిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం వల్లే తాను క్షణికావేశానికి గురైనట్లు వివరణ ఇచ్చారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి సిద్ధం.. రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌లను చిత్తుగా ఓడిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించానని, ఒకవేళ ఆయన కొడంగల్ నుంచి పోటీ చేయకపోతే.. తానే కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధం అని ప్రకటించారు రేవంత్. అధిష్టానం ఆదేశిస్తే.. పోటీకి సై అన్నారు. తెలంగాణలో హంగ్ కు అవకాశమే లేదని, వందశాతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: డబ్బుల పంపిణీని కట్టడి చేయండి.. ఈసీకి ఎంపీ ఉత్తమ్ ఫిర్యాదు తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు ఎంపీ ఉత్తమ్. ఎన్నికల వేళ అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2018లోనూ ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడూ అలాగే చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో డబ్బులను నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేస్తోందని, ఈ పంపిణీని అడ్డుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎంపీ ఉత్తమ్. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వాసివాడి తస్సాదియ్యా.. పొలిటికల్ పార్టీల పెండ్లి.. శుభలేఖ చూస్తే అవాక్కవ్వాల్సిందే..! కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ సంచలన పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఆ ఆరోపణలకు మరింత మసాలా దట్టించి పోస్ట్ చేసింది. రెండు పార్టీల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, త్వరలోనే ఈ రెండు పార్టీలు వివాహం చేసుకోబోతున్నాయంటూ ఓ సెటైరికల్ వెడ్డింగ్ కార్డ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. By Shiva.K 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్ తలుచుకుంటే రేవంత్‌ను ఎప్పుడో జైల్లో వేసేవారు: హరీష్ రావు ముఖ్యంత్రి కేసీఆర్ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైల్లో పెట్టేవారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. విపక్షాలు ఎన్ని ట్రిక్కులు చేసినా కూడా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి కావాలో లేక ఉద్యమ కారుల భుజాలపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తులు కావాలో ప్రజలే ఆలోచించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో.. ధరణిని బంగాళఖాతంలో కలపాలన్న వారినే ప్రజలు అదే బంగాళాఖాతంలో ముంచుతారని పేర్కొన్నారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn