Latest News In Telugu Kavita: ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ నుంచి కవితకు ఆహ్వానం.. ఎందుకంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆక్స్ఫర్డ్ యూనిర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. అక్టోబర్ 30న నిర్వహించే కార్యక్రమంలో.. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ఎలా పురోగమించింది, రైతులకు రైతుబంధు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, అలాగే 24 గంటల ఉచిత కరెంట్ తదితర అంశాలపై కవిత ప్రసంగం చేయనున్నారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై పోలీసుల కీలక ప్రకటన.. ఏం అన్నారంటే.. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. బ్యారేజీ వంతెన పిల్లర్లపై పగుళ్లు ఉన్నట్లు గుర్తించామని.. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫోరెన్సీక్ క్లూస్ టీం సాయంతో కూడా ఆధారాలు సేకరిస్తున్నామని.. ఇప్పటికే కేంద్ర కమిటీ కూడా బ్యారేజీని పరిశీలించిందని చెప్పారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మేడిగట్ట బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై.. కేసీఆర్‌పై ఫైర్ అయిన విపక్ష నేతలు కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోవడంతో బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. జరిగిన నష్టాన్ని కూడా వారి నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోందని ఈటల రాజేందర్ అన్నారు. ఇసుకమీదే ఆ ప్రాజెక్టు కట్టారని.. అప్పట్లో కన్నెపల్లి పంప్‌హౌస్ మొత్తం కూలిపోయిందంటూ విమర్శించారు. ఈ ఘటనపై నిపుణుల కమిటీ వేసి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు By B Aravind 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బతుకమ్మ, దసరా సంబరాలు.. నగరంలో ప్రయాణికుల రద్దీ.. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగరవాసులు తమ సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో ఆదివారం ఉదయం నుంచి రద్దీ వాతావరణం నెలకొంది. దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో రోజువారీ 3,500 బస్సులకు అదనంగా 1,700 అదనపు బస్సులు ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మంత్రి పదవి ఇచ్చినా అందరినీ మోసం చేశావ్.. తుమ్మలకు పువ్వాడ కౌంటర్.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మంత్రి పువ్వాడ.. తుమ్మలపై ఫైర్ అయ్యారు. రౌడీయిజం, గుండాయిజం పెంచి పోషించింది నువ్వు కాదా.. అంటూ ధ్వజమెత్తారు. నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో ఎంతమంది రాజకీయ సమాధీ అయ్యారో తెలియదా అంటూ ప్రశ్నించారు. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఇచ్చిన పదవులు పొంది వాళ్లని మోసం చేసి.. చివరికి కేసీఆర్ దగ్గర చేరావని.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లావంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మం ప్రజల్ని ఎవరు మోసం చేశారో వాళ్లే ఎన్నికల్లో నిర్ణయిస్తారంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS-AP Border: ఆలయ భూముల్లో వివాదం.. తెలంగాణ, ఏపీ బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం ఆలయ భూముల్లో గోశాల నిర్మాణ పనులు చేపడుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురుషోత్తపట్నం గ్రామస్థులు అడ్డుకున్నారు. దేవాలయం భూములు తమవేనంటూ ఆందోళన చేశారు. దీంతో భద్రాచలం ఆలయ సిబ్బంది, గ్రామస్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గోశాల నిర్మాణ పనులకు సహకరించాలని.. ఏపీ రెవెన్యూ అధికారుల్ని భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి కోరుతున్నప్పటికీ.. ఇందుకు ఏపీ రెవెన్యూ అధికారులు సహకరించడం లేదు. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medigadda Barrage Updates: మేడిగడ్డ కూలిపోతుందా?.. అసలేం జరుగుతోందంటే? మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు, మీడియాను బ్యారేజ్ వద్దకు అనుమతించడం లేదు. 19, 20 పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు అధికారులు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. By Nikhil 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pravalika Suicide Case: ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కోర్టులో లొంగిపోయిన శివరాం.. ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి శివరాం రాథోడ్ పరారీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. చివరకి తాను లొంగిపోతున్నానంటూ నాంపల్లి కోర్టులో సరెండర్ పిటిషన్‌పై దాఖలు చేశాడు శివరాం. By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: 'ఇన్ని రోజులు ఏం చేశారు'.. బీఆర్ఎస్కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. బీఆర్ఎస్ పార్టీకి ఓ ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల గుర్తుల్లో కారును పోలి ఉన్న గుర్తులను రద్దు చేయాలంటూ ఇటీవలె బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసింది. అయితే వీటిపై తాజాగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ రెండు పిటిషన్లను కొట్టివేసింది. మునుగోడు ఉపఎన్నికల్లో.. హైకోర్టు కొట్టివేసిన పిటిషన్‌పై ఆలస్యంగా వచ్చారని.. అధికార పార్టీ అయ్యుండి కూడా.. 240 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టడం కుదరదని తేల్చి చెప్పింది. అయితే హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn