TSRTC: టీఎస్ఆర్టీసీ రికార్డు.. ఒక్కరోజులోనే బస్సుల్లో 50 లక్షల మంది ప్రయాణం..
తెలంగాణలో సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో ఏకంగా 50 లక్షల మంది ప్రయాణించారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం, అలాగే కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారు.