CM Revanth Reddy: కేసీఆర్ను పరామర్శించిన సీఎం రేవంత్.. ఫొటోలు వైరల్..
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ను.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా అసెంబ్లీకి రావాలని.. ప్రజల సమస్యలను ప్రస్తావించాలని కోరుతున్నానని రేవంత్ మీడియాతో తెలిపారు. మంచి ప్రభుత్వ పాలన అందించేందుకు ఆయన సూచనలు అవసరమన్నారు.