Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని ఒకరు మృతి
సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వస్తున్న కారు.. ఆగిఉన్న ఓ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు, లారీ దగ్ధం కావడంతో ఒకరు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది.