Hyderabad Metro : వావ్.. హైదరాబాద్ మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణం.. హైదరాబాద్ మెట్రోరైలు మరో ఘనత సాధించింది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటిందని.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయ్యిందని, నిత్యం 5.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారన్నారు. By B Aravind 03 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hyderabad : హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) కు మంచి ప్రజాధారణ గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. తక్కవ సమయంలో వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు నగరంలో అనేకమంది ఈ మెట్రోల్లో ప్రయాణాలు చేస్తుంటారు. అయితే హైదరాబాద్ మెట్రో మరో ఘనతను సాధించింది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. Also Read: రోహిత్ వేముల సూసైడ్ కేసుపై పోలీసుల సంచలన రిపోర్టు.. నగరంలో గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్(Green Miles Loyalty Club) ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మెట్రోపై ప్రయాణికులను నమ్మకం పెరిగిందని తెలిపారు. మెట్రో వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయ్యిందని పేర్కొన్నారు. ప్రతిరోజూ సగటున 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఇక రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి ఇప్పటికే డీపీఆర్(DPR) లు సిద్ధమయ్యాయని స్పష్టం చేశారు. Also Read: హైదరాబాద్‌లో మండిపోతున్న ఎండలు.. #telugu-news #hyderabad-metro #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి