Gurukul: ప్రిన్సిపల్ మీద కోపంతో వాటర్ ట్యాంక్లో విషం.. 11 మంది విద్యార్థులకు అస్వస్థత
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఒక టీచర్ చేసిన నిర్వాకం ఇప్పుడు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. పైఅధికారిపై ఉన్న కక్షతో పాఠశాల మంచినీటిలో పురుగుల మందు కలిపాడు ఓ ఉద్యోగి. ఈ విషయం బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.