Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు.
ములుగు జిల్లాలో ఇటీవల వచ్చిన పెను గాలుల్లో తాడ్వాయి-మేడారం అడవుల్లో భారీగా చెట్లు కూలిపోయాయి. ఈ విధ్వంసంపై మంత్రి సీతక్క స్పందించారు. జరిగిన సంఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. అక్కడి వనదేవతలు సమ్మక్క సారక్కల దయతోనే పెను విధ్వంసం తప్పిందని ఆమె వ్యాఖ్యానించారు.
TG: శ్రీశైలం పవర్ హౌస్‌లో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఏడో నంబర్ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: ఖమ్మం జిల్లాలో ఐదురోజుల పాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు ఆ జిల్లా కలెక్టర్. తిరిగి సోమవారం విద్యాసంస్థలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వాలకు చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మరో 50 లక్షలు చిరు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
TG: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 42.2 అడుగులకు చేరింది. దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. ఈరోజు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఆహరం లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలెబ్రెటీలు విపత్తు బాధితులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. హీరో NTR, సిద్దు, విశ్వక్ తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా మరికొన్ని రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. తాజాగా మరో 28 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు అవ్వగా..152 సర్వీసులను వేరే రూట్లో పంపుతున్నట్లు తెలిపారు.