Kumari Aunty: వరద బాధితులకు కుమారి ఆంటీ సహాయం.. రూ. 50000 విరాళం!

తెలంగాణ వరద బాధితులకు తన వంతు సహాయం చేసేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 50000 విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును కుమారి ఆంటీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.

New Update
kumari-aunty

Kumari Aunty: తెలంగాణ వరద బాధితులకు తన వంతు సహాయం చేసేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 50000 విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును కుమారి ఆంటీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.

publive-image

వారం రోజుల కిందట రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. వరద ప్రభావంతో పలు ప్రాంతాలు నీటి మునిగి ప్రజలు అల్లాడిపోయారు. తినడానికి తిండి, ఉండడానికి నివాసం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ విపత్తు బాధితులను ఆదుకునేందుకు పలువురు ఫిల్మ్ స్టార్స్ ముందుకొచ్చారు. తమ సాయంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. హీరోలు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమకు తోచిన సహాయం చేశారు.

కుమారీ ఆంటీ రూ. 50000 విరాళం

తాజాగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో పాపులారైనా కుమారీ ఆంటీ కూడా తన వంతు సహాయం ప్రకటించింది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో స్వయంగా కలిసి రూ. 50000 చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విరాళాలు ప్రకటించిన సినీ తారలు

ఇప్పటికే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ వరద బాధితుల కోసం తారక్ రూ. కోటి, బాలకృష్ణ రూ. కోటి, వైజయంతి రూ. 25లక్షలు, హాసిని హారిక ఎంటర్ టైన్మెంట్స్ రూ. 50 లక్షల అల్లు అర్జున్ రూ. కోటి, చిరంజీవి రూ. కోటి, మహేష్ బాబు రూ. కోటి, పవన్ కళ్యాణ్ రూ. కోటి, సిద్దు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు, విరాళాలను ముఖ్యమంత్రికి అందజేశారు.

Advertisment
తాజా కథనాలు