Telangana Elections: కాంగ్రెస్లో వారికి జాక్పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు..
కాంగ్రెస్ పార్టీ కొందరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పార్టీలో చేరడమే ఆలస్యం అన్నట్లుగా పలువురు నేతలకు టికెట్లు కన్ఫామ్ చేసింది. మరికొందరు పేర్లను హోల్డ్ లో ఉంచినా.. వారికి కూడా కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న నేతల్లో ప్రముఖంగా మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు సహా తదితర నేతలు ఉన్నారు.