Telangana Elections: కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి సిద్ధం.. రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌లను చిత్తుగా ఓడిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించానని, ఒకవేళ ఆయన కొడంగల్ నుంచి పోటీ చేయకపోతే.. తానే కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధం అని ప్రకటించారు రేవంత్. అధిష్టానం ఆదేశిస్తే.. పోటీకి సై అన్నారు. తెలంగాణలో హంగ్ కు అవకాశమే లేదని, వందశాతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.