Modi: హైదరాబాద్లో మోదీ రోడ్ షో: వేలాదిగా జనసందోహం
తెలంగాణలో తన ప్రచారంలో చివరిరోజైన సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో నిర్వహించిన రోడ్ షోకు వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. రోడ్ షో పొడవునా పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
తెలంగాణలో తన ప్రచారంలో చివరిరోజైన సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో నిర్వహించిన రోడ్ షోకు వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. రోడ్ షో పొడవునా పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పీఎం మోదీ. తెలంగాణలో బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అన్నారు. డిసెంబర్ 3 తరువాత లిక్కర్ స్కాంపై విచారణ వేగవంతం చేస్తామని తెలిపారు.
మద్యం ప్రియులకు చేదు వార్త. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వైన్స్, బార్లు మూడు రోజులపాటు బంద్ కానున్నాయి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ మూతపడనున్నాయి.
కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం వల్లే ఈసీ రైతు బంధు నిధులు ఆపేసిందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ గెలిస్తే.. తొలి మంత్రివర్గ సమావేశంలో అసైన్డ్ భూములకు పట్టాలపై సంతకం చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్.
రైతు బంధు నిధుల విడుదల ఆపేయాలని ఈసీ బీఆర్ఎస్ పార్టీకి ఆదేశాలు ఇవ్వడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వల్లే నిధులు ఆగాయని అన్నారు. రాబందులను తరిమికొట్టండి అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు చెల్లింపులకు మళ్లీ అనుమతించాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది.
తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతోందని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు స్వస్తి పలకనున్నారని అన్నారు. మహబూబాబాద్ బీజేపీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
తెలంగాణలో ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో రూ.11 కోట్ల నగదును పోలీసులు, ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నగదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చెందినవారిగా పోలీసులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలే ఎలక్షన్ కమిషన్ వెంటపడి మరీ రైతు బంధును ఆపివేయించారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మరోసారి రైతు వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని.. అన్నదాత నోటికాడికి వచ్చిన ముద్దను లాగేసుకున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు.