కొత్తగూడెం: జలగం క్యాంప్ కార్యాలయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు
ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సోదాల్లో ఎలాంటి నగదు దొరకలేదని అధికారులు తెలిపారు.
ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సోదాల్లో ఎలాంటి నగదు దొరకలేదని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్, హుజూరాబాద్, గోషామహల్ లోనూ తామే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వేవ్ బలంగా ఉందన్నారు. ఈ రోజు మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు.
ప్రపంచంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తొలి దేశం అమెరికా. అక్కడే తొలిసారి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికాలో మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788-1789లో జరిగాయి. అయితే పౌరులందరికీ అమెరికా ఓటు హక్కు ఇవ్వలేదు. అమ్మాయిలు ఓటింగ్లో పాల్గొనలేదు.
తెలంగాణ భవన్ లో దీక్షా దివాస్ నిర్వహణను ఎన్నికల స్క్వాడ్ అడ్డుకుంది. దీన్ని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇది ఎన్నికల సభ కాదని బీఆర్ఎస్ ఎన్నికల అధికారులకు చెబుతుండగా.. వారు మాత్రం అనుమతించడం లేదు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మంచి నాయకత్వాన్ని ఎంచుకోవాలని ఓటర్లను కోరారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
నిన్న అర్ధరాత్రి కరీంనగర్ లో హై టెన్షన్ చోటు చేసుకుంది. పోలీసులే డబ్బులు పంచుతున్నారంటూ బండి సంజయ్ గొడవకు దిగారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా డబ్బులు పంచుతున్నారని ఆందోళన చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావాలంటే ఓటు హక్కు కీలకమని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.
మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా.. ఫోన్ కాల్ ద్వారా ఓటర్లకు చేరువ అవుతున్నారు సీఎం కేసీఆర్. ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా ప్రజలను బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. 'హలో.. నేను మీ కేసీఆర్' అనే గొంతు విని ఆశ్చర్యపోతున్నారు జనాలు.