రేవంత్ రెడ్డి పాటకు బండ్ల గణేష్ మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్!
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. ఏ ఒక్క ఓటునూ వదులుకోవడానికి సిద్ధంగా లేని అభ్యర్థులు భారీ ఖర్చులకూ వెనుకాడడం లేదు. ముఖ్యంగా కులసంఘాలు, మహిళా సంఘాలను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో 144 సెక్షన్ అమ్మల్లో ఉంది. పోలీసుల తనిఖీల్లో భాగంగా భారీగా మద్యం, నగదు పట్టుబడింది. వరంగల్ లో రూ.8 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే మంచిర్యాలలో కూడా రూ. 15.81 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఎన్నికలు రాజకీయ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందా? అని ఏపీలో ప్రధాన పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని వైసీపీ, కాంగ్రెస్ పార్టీనే గెలవాలని టీడీపీ భావిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఎన్నికల సంఘం కంటే సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మొత్తం 96 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. 22 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం సాగించారు. చివరగా గజ్వేల్ సభకు హాజరయ్యారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సారి తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. రాహుల్ గాంధీ 23, ప్రియాంక 26, మల్లికార్జున్ ఖర్గే 10 సభల్లో పాల్గొన్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన మార్క్‌ను చూపించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 నియోజకవర్గాల్లో 87 సభలు నిర్వహించి దుమ్ము లేపారు. తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలైన కొడంగల్, కామారెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ చీఫ్ హోదాలో ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని అన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు.
తెలంగాణను బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని; రాష్ట్ర పునర్నిర్మాణం, సమస్యలన్నిటికీ పరిష్కారం సోనియాగాంధీ నేతృత్వంలోని ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో వీడియో షేర్ చేశారు.