TS Elections 2023: మళ్లీ అధికారం మాదే.. కొడంగల్, హుజూరాబాద్ లోనూ గెలుస్తున్నాం: కేటీఆర్ సంచలన లెక్కలివే!

రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్, హుజూరాబాద్, గోషామహల్ లోనూ తామే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వేవ్ బలంగా ఉందన్నారు. ఈ రోజు మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు.

New Update
TS Elections 2023: మళ్లీ అధికారం మాదే.. కొడంగల్, హుజూరాబాద్ లోనూ గెలుస్తున్నాం: కేటీఆర్ సంచలన లెక్కలివే!

KTR Chit Chat with Media: ఈ రోజు తెలంగాణ భవన్ లో నిర్వహించి దీక్షా దివాస్ కు హాజరైన మంత్రి కేటీఆర్ (Minister KTR) మీడియాతో చిట్ చాట్ చేశారు. మరికొన్ని గంటల్లో తెలంగాణలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోసారి తామే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. ములుగు, గోషామహల్, హుజురాబాద్ లాంటి సీట్లతో పాటు పాటు ఖమ్మం జిల్లాలో కూడా తాము కొన్ని గెలుస్తున్నామన్నారు. రాజాసింగ్ కు చెందిన లోద్ కమ్యూనిటీ వాళ్లు వచ్చి మాట్లాడారని చెప్పారు. వారు తమతోనే ఉంటామని చెప్పారని వివరించారు. మార్వాడి కమ్యూనిటీ వాళ్లు సైతం తమకే మద్దతు తెలిపినట్లు వివరించారు. సీఓటర్ సర్వే 2018లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందనే చెప్పిందని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేద్దామా? బండి సంజయ్ కి గంగుల సవాల్

ఇప్పుడు కూడా అలానే చెప్పడం తమకు శుభసూచకమన్నారు. కొడంగల్ లో కూడా బీఆర్ఎస్ (BRS) గెలవబోతోందన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ (KCR) గెలుస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి రెండు చోట్లా ఓడిపోతున్నాడని జోస్యం చెప్పారు కేటీఆర్. సిరిసిల్లలో చాలా టఫ్ ఉందని కాంగ్రెస్ సర్వేలు తప్పుడు ప్రాపగాండా చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. అధికారం రావడానికి 51 శాతం ఓట్లు చాలన్నారు. కాంగ్రెస్ చాలా ప్రాంతాల్లో బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు.

ఆ రెండు పార్టీలు కలిసిపోయాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఎందుకు గోషామహల్ లో ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. కరీంనగర్, కోరుట్లలో రాహుల్, రేవంత్ ప్రచారం చేయలేదన్నారు. ప్రధాని మోదీ చేసిన ప్రచారం అంతా పార్లమెంటు ఎన్నికల కోసమని ఫైర్ అయ్యారు. బీజేపీకి లాస్ట్ టైం 108 సీట్లలో డిపాజిట్ రాలేదన్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వేవ్ ఉందన్నారు. ఉమ్మడి రంగారెడ్డిలో రెండు మూడు చోట్ల గట్టిపోటీ ఉంటుందన్నారు.

పొలిటికల్ టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారని చివరి వరకు ఉండేది కేసీఆర్ మాత్రమేనన్నారు. గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే అని తనదైన శైలిలో విశ్లేషించారు. సైలెంట్ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ లో 10 లో 9 సీట్లు గెలుస్తున్నామన్నారు. రైతుబంధు ఆపడం కోసం కాంగ్రెస్ నేత ఉత్తమ్ ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారని ఆరోపించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు